![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా వైల్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ లో దివ్య నిఖితకి బిగ్ బాస్ ఒక ముఖ్యమైన భాద్యతని అప్పగించాడు. రెండు వారాలు హౌస్ మేట్స్ ఆటతీరు చూసావ్ కదా హౌస్ లోని వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వమని దివ్యకి బిగ్ బాస్ చెప్తాడు. దివ్య చాలా స్మార్ట్ గా అందరికి ర్యాంకింగ్ ఇస్తూ పర్ఫెక్ట్ రీజన్ చెప్తుంది.
పదమూడో స్థానం నుండి మొదలు పెట్టిన దివ్య.. పదమూడో స్థానం ఫ్లోరా సైనీకి.. పన్నెండో స్థానం రాము రాథోడ్ కి. పదకొండో స్థానం పవన్ కళ్యాణ్.. పదో స్థానం శ్రీజ.. తొమ్మిది హరిత హరీష్.. ఎనమిది ప్రియ.. ఏడు రీతూ.. ఆరు సుమన్ శెట్టి.. అయిదు తనూజ.. నాలుగు డీమాన్ పవన్.. మూడు సంజన.. రెండు ఇమ్మాన్యుయల్.. మొదటి స్థానం భరణి. ఇలా అందరికి వారి పర్ఫామెన్స్ బట్టీ ర్యాంకింగ్ ఇచ్చింది దివ్య. దాంతో టాప్-7 కంటెస్టెంట్స్ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే అందులో అయిదుగురిని దివ్యని సెలక్ట్ చేసుకోమంటాడు. అందులో తన పేరు కూడా చేర్చుకోవచ్చని బిగ్ బాస్ చెప్తాడు.
నాకు వచ్చిన ఛాన్స్ నేను మిస్ చేసుకోనని తన పేరు ఖుడా చెప్పుకుంటుంది దివ్య. తనతో పాటుగా సుమన్ శెట్టి, తనూజ, ఇమ్మాన్యుయల్, భరణి, దివ్య వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ గా సెలెక్ట్ చేసుకుంటుంది దివ్య. ఆ తర్వాత నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని దివ్యని రీతూ అడుగుతుంది. ఇప్పుడు నేను సెలక్ట్ చేసినవాళ్లు అందరు కూడా ఎటాక్ చేసే ముందు ఒక థర్టీ సెకెండ్స్ ఆలోచిస్తారు కానీ నువ్వు అలా థింక్ చెయ్యవ్.. నాకు సేఫ్ సైడ్ గా ఉండాలని.. నిన్ను తీసుకోలేదని దివ్య సమాధానం చెప్తుంది.
![]() |
![]() |